13-11-2025 09:59:17 PM
టీపీటీఎఫ్ జిల్లా నాయకులు వి.శ్యామ్ సుందర్
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు టీపీటీఎఫ్ చేపట్టిన మూడు దశల ఉద్యమ కార్యక్రమంలో భాగంగా గురువారం టీపీటీఎఫ్ కన్నాయిగూడెం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోత్ కోటి, కే.బాలరాజు ఆధ్వర్యంలో మండలంలో ఆశ్రమ పాఠశాలలో కరపత్రం ఆవిష్కరణ చేసి నిరసన వ్యక్తం చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ విద్యారంగం, ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. సుమారు పద్నాలుగు సంవత్సరాలనుండి ఉపాధ్యాయులు పోస్టులు, ముప్పై సంవత్సరాలనుండి నాలుగవ తరగతి ఉద్యోగుల మరియు క్లర్క్ పోస్టులు మంజూరు చెయ్యలేదు అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ మూడు దశల ఉద్యమ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు జాజుల సురేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.