13-11-2025 10:10:20 PM
మనోహరాబాద్ (విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం కూచారం సమీపం 44వ జాతీయ రహదారిపైన టైరు బ్లాస్ట్ అయ్యి స్క్రాప్ ను తీసుకువస్తున్న డీసీఎం బోల్తా కొట్టింది. కాళ్ళకాల్ నుండి తూప్రాన్ వైపు పాత డోర్ల లోడుతో వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. టైరు బ్లాస్ట్ అయ్యి అదుపు తప్పిన డీసీఎం బోల్తా కొట్టడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.