calender_icon.png 13 November, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జంకిలో గరుత్మంతుని విగ్రహ ఆవిష్కరణ

13-11-2025 10:07:58 PM

బెజ్జంకి: మహావిష్ణు వాహనం గరుత్మంతుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో రహదారిపై భక్తి శ్రద్ధలతో నిర్మించిన గరుత్మంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. విగ్రహం సుమారు 18 అడుగుల ఎత్తుతో, భక్తుడిగా నమస్కారం చేస్తున్న భంగిమలో, రెక్కలు విప్పుకొని నిలుచున్న గరుత్మంతుని రూపంలో అద్భుతంగా రూపుదిద్దుకుంది. సుమారు రూ.3 లక్షల వ్యయంతో విగ్రహాన్ని నిర్మించారు.

మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, గరుత్మంతుని ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. గరుత్మంతుని మహిమను వివరించే ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు, గ్రామస్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై గరుత్మంతుని ఆశీస్సులు పొందారు.