13-11-2025 10:02:26 PM
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్..
క్రీడలు క్రమశిక్షణ, జట్టు స్పూర్తి, ఓర్పు నేర్పిస్తాయి...
ఆటల ద్వారా మనసు, శరీరం, వ్యక్తిత్వం వికసిస్తాయి...
వనపర్తి క్రైమ్: విజేత విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసిన జిల్లా ఎస్పీ మహాత్మ జ్యోతిబాపూలే గురుకులంలో ఉత్సాహభరితంగా ముగిసిన క్రీడా సమారోహం. పుస్తకాలతో పాటు మైదానాల్లోనూ విజయం సాధించగలిగితేనే నిజమైన విద్యార్థిగా నిలుస్తారని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు. గురువారం రోజు వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాస్థాయి క్రీడల ముగింపు కార్యక్రమానికి వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ఐపిఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం కేవలం విధి కాదు, అది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం. సీసీఎస్ విభాగం నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి దర్యాప్తులో వాస్తవాలను ఆధారంగా తీసుకుని పారదర్శకంగా, సమయపాలనతో వ్యవహరించాలి. ప్రజల విశ్వాసం పొందడం పోలీసు శాఖకు అత్యంత ముఖ్యమైనది. అశోక్ కుమార్ గత అనుభవాన్ని వనపర్తి జిల్లాలో వినియోగించి సమర్ధత, క్రమశిక్షణతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని నేను ఆశిస్తున్నాను” అన్నారు. అనంతరం క్రీడలలో గెలుపొందిన విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ప్రశాంతి. ఉపాధ్యాయులు, విద్యార్థులు పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు