13-11-2025 10:05:04 PM
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ (విజయక్రాంతి): రైతుల ధాన్యం కొనుగోలు చేసి నెలరోజులు గడిచినా ఇప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.“మహిళా సంఘాలకు ఒక్క సెంటర్ కూడా ఇవ్వకుండా అన్ని కొనుగోలు కేంద్రాలను కోఆపరేటివ్ సొసైటీలకే కేటాయించారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతుల శ్రమను, సొమ్మునుదోచుకుంటున్నారు” అని విమర్శించారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో తరిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనమని కొర్రీలు పెడుతున్నారని తెలిపారు. తేమ, తాలు, మొలకల పేరుతో మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయంలో ధాన్యం కొన్న వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి. కానీ ఇప్పుడు నెలరోజులు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు”అనిపేర్కొన్నారు.తక్షణమే రైతుల ధాన్యం కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు ప్రదీప్ రెడ్డి, తరాల బలరాం, పల్లె విజయ్, గుర్రం గణేష్, రాచకొండ వెంకన్న, నోముల కేశవరాజు, పీర్ల కృష్ణకాంత్, యానాల లింగారెడ్డి, గొర్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.