calender_icon.png 20 September, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలి

20-09-2025 12:00:00 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ,సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను నిర్వహించగా నిబంధనలను అనుసరించి ఆమోదయోగ్యమైన అన్ని దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో  రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూభారతి దరఖాస్తులు.

ఇప్పటివరకు పరిష్కరించిన వాటి సంఖ్య, ఇంకా పరిష్కారమయ్యే దరఖాస్తులు, 22(ఏ) కిందకు వచ్చే భూము లు, సాదా బైనామా, ఫారెస్ట్ భూములు, శిఖం, అసైన్డ్ భూములు, తదితర రెవెన్యూ అంశాలపై హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్  వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులు, ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను, సాదా బైనామా దరఖాస్తుల గురించి తహసీల్దార్లు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహబరీష్ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. జిల్లాలోని మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, చెరువు శిఖం, అసైన్డ్, తదితర ప్రభుత్వ భూముల వివరాలను అందజేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, తహసీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.