04-06-2025 07:55:54 PM
తహశీల్దార్ వాజిద్ అలీ..
కోదాడ: భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారానే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తహశీల్దార్ వాజిద్ అలీ(Tahsildar Wajid Ali) అన్నారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని రెడ్ల కుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన భూభారతి రెవెన్యూ సదస్సు(Bhu Bharathi Revenue Conference) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు భూమి సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు ఇవ్వవలసిందిగా కోరారు. ఖచ్చితంగా రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. దేవాలయ కమిటీ చైర్మన్ సాధినేని అప్పారావు, నాయకులు కనగాల నాగేశ్వరరావు, మల్లెల పుల్లయ్య రైతులు పాల్గొన్నారు.