03-05-2025 04:47:57 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని చింతమాన్ పల్లె గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ ను శనివారం ఎంపిడివో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు వేసవిని దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా బయటకు వెళ్లాల్సి వస్తె గొడుగు తప్పనిసరిగా తీసుకువెళ్లాలని అన్నారు. హెల్త్ సెంటర్ సిబ్బంది సెంటర్ లో అందుబాటులో ఉండాలని అన్నారు. అనంతరం ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఇట్టి కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సిబ్బంది ,పంచాయతీ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.