calender_icon.png 9 July, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు బుక్స్, ప్లేట్లు పంపిణీ

08-07-2025 07:58:26 PM

ఎల్బీనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎంఎంజీ ఫౌండేషన్(MMG Foundation) ఆధ్వర్యంలో మంగళవారం నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు తదితర విద్యా సామగ్రిని అందజేశారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఎన్జీవోస్ కాలనీలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీడీపీ నాయకుడు గద్దె విజయ్ నేత సహకారంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్, బిస్కెట్స్, అల్పాహారం తినడానికి కావాల్సిన స్టీల్ ప్లేట్స్ అందజేశారు. కార్యక్రమంలో సామాజిక వేత్త శ్రీదేవి, రేటినేని వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు జయమ్మ, నాగరాజు, ప్రసన్న, సురేష్ చారి తదితరులు పాల్గొన్నారు.