08-07-2025 07:50:44 PM
హుజూర్ నగర్: పట్టణంలోని శిరిడి సాయిబాబా మందిరములో ఈనెల 10న గురు పౌర్ణమిని పురస్కరించుకొని సాయిబాబాకు పంచామృతాలచే అభిషేకములు విశేష పూజలు శ్రీ అన్నమయ్య భజన మండలి వారిచే భక్తి భజన గురు సత్కార కార్యక్రమం, అనంతరం సాయంత్రం మహిళా భక్త బృందం వారు చామంతి, గులాబి, మల్లె పూలతో అర్చన కార్యక్రమం రాత్రి అశేష భక్త బృందంచే పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబా కృపకు పాత్రులు కావాలని షిరిడి సాయి సమాజం సెక్రెటరీ ఓరుగంటి నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ ఆకుల రాము, ప్రధాన పూజారి జానకి రామశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.