08-07-2025 07:32:01 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టంలో భాగంగా జిల్లా వ్యవసాయధికారి జె. భాగ్యలక్ష్మి(District Agriculture Officer J. Bhagyalakshmi) కొత్తపల్లి మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులలోని ప్రస్తుత యూరియా, డీఏపీ నిల్వలను తనిఖీ చేశారు. తగిన మొత్తంలో నిల్వలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. నానో డీఏపీ, యూరియాను వాడేటట్టు రైతులను ప్రోత్సహించాలని అన్నారు.