08-07-2025 08:07:45 PM
మున్సిపల్ కమిషనర్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పట్టణంలో నూతనంగా నిర్మించిన బయో మైనింగ్ సైట్ ను సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్(Municipal Commissioner Syed Musab Ahmed) ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ లో ఏర్పాటు చేయనున్న బయో మైనింగ్ సైట్ ను మంగళవారం సంబంధిత ఏజెన్సీ నిర్వహకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణంలో జనాభా రోజురోజుకు పెరిగిపోతున్నందున చెత్త కూడా అధికంగా వస్తుందన్నారు. ఎప్పటికప్పుడు శుద్ధి చేసే ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం బయో మైనింగ్ సైటుకు సంబంధించి కావలసిన సదుపాయాలు పునరులను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సంప్రదించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ రవీందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.