08-07-2025 07:56:17 PM
వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రేమిడాల రాజు..
చిలుకూరు: కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా(Suryapet District) అధ్యక్షులు రెమిడాల, రాజు అన్నారు. మంగళవారం జర్రిపోతుల గూడెం గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడుతూ... జులై 9, బుధవారం నాడున జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించాలని సంవత్సరానికి కూలీలకు 200, రోజులు పనులు కల్పించి రోజుకు వేతనం 600, రూపాయలు, ఇవ్వాలని ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని ఇందిరమ్మ ఇండ్లకు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల చొప్పున మంజూరు చేయాలని ఇండ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొత్త వృద్ధులు వికలాంగుల పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ పాషా, కోటయ్య, వీరారెడ్డి, మౌలానా, నంద్యాల నర్సిరెడ్డి, మదారి హుస్సేన్, యాకమ్మ, పేర్ల సుగుణ, ఆదమ్మ, రోశయ్య, జానీ బేగం, కూలీలు పాల్గొన్నారు.