08-07-2025 07:41:54 PM
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండలంలోని జూకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మహమ్మద్ రఫీ ఇటీవలే పి.హెచ్.డి పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ, ఉపాధ్యాయ బృందం డాక్టర్ మహమ్మద్ రఫీని సోమవారం ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ... రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పిహెచ్డి పట్టా పొందడం పాఠశాలకు గర్వకారణం అని కొనియాడారు. ఆయన పరిశోధన జ్ఞానం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేసేలా వారి బోధన మరింత ప్రభావంతంగా విద్యార్థులకు ఉపయోగపడాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మమత, ఉమాదేవి, స్వరూప, రవీందర్,శ్రీనివాస్,యోగానంద చారి పాల్గొన్నారు.