14-08-2025 04:49:38 PM
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి..
బాన్సువాడ (విజయక్రాంతి): ప్రముఖ సంఘ సంస్కర్తలు జోగిని వ్యవస్థ నిర్మూలన కొరకు పోరాటం చేసిన ఘనత లవణం హేమలత దంపతులకే దక్కుతుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Government Agricultural Advisor Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సునాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో సంస్కార్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థకులు, ప్రముఖ సంఘ సంస్కర్తలు, జోగిని వ్యవస్థ నిర్మూలన కొరకు పోరాటం చేసిన లవణం, హేమలత దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజుల చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరించారు. లవణం హేమలత దంపతులు జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారని వారి సేవలు మరువలేని అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు, సంస్కార్ ఆశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.