calender_icon.png 14 August, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లోకి మారిన డీసీసీబీ బ్యాంక్

14-08-2025 04:47:28 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (DCCB) వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కొత్త ఆవరణలోకి మారింది. గతంలో అంగడి రోడ్డులో ఉన్న అద్దె భవనంలో ఏర్పాటు చేయగా, రోడ్డుకు దూరంగా ఉండటంతో కొత్త ప్రాంగణంలోకి మార్చాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా డిసిసి బ్యాంక్ కోసం అద్దెకు ఇచ్చారు. అలాగే బ్యాంకు కార్యకలాపాలకు అణువుగా గ్రౌండ్ ఫ్లోర్ ను మార్కెట్ అధికారులు మాడిఫై చేసి ఇచ్చారు. బుధవారం నుండి నూతన ప్రాంగణంలో బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించారు. మార్కెట్లో బ్యాంకు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు, ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.