13-09-2025 02:26:20 AM
-జస్టిస్ ఎ.వెంకటేశ్వర రెడ్డి (రిటైర్డ్), సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి
-ఎల్బీనగర్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ లో మాగ్నా జ్యూరిస్ ’లా ఎగ్జిబిషన్’
ఎల్బీనగర్, సెప్టెంబర్ 12 : లాయర్లు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి (రిటైర్డ్), సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి సూచించారు. ఎల్బీనగర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ లో శుక్రవారం మాగ్నా జ్యూరిస్ ’లా ఎగ్జిబిషన్’ నిర్వహించారు. లా ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ లో విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణులు పాల్గొని, వివిధ అంశాలపై ప్రసంగించారు.
సదస్సులో సమకాలీన చట్టపరమైన సమస్యలపై వినూత్న ఆలోచనలు, పరిశోధనలు, దృక్పథాలను వివరించారు. లా ఎగ్జిబిషన్ లో ట్రెండింగ్ చట్టపరమైన అంశాలపై నిపుణుల ప్రసంగాలు, వివిధ చట్టాలపై ఇతివృత్తాలపై ఇంటరాక్టివ్ స్టాల్స్, ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ సదస్సులో రిటైర్డ్ జడ్జి వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి మాట్లాడుతూ... ప్రస్తుత చట్టపరమైన సమస్యలు , వాటి పరిష్కారాలను వివరించారు.
సమాజంలో చట్టం, చట్టాల అనువర్తనాలు, చట్టాలపై విమర్శనాత్మక ఆలోచనలు, సృజనాత్మకత, సహకారాన్ని పెంపొందించే అంశాలను లా విద్యార్థులకు వివరించారు. ప్రోబెలాబ్ ఫోరెన్సిక్ విభాగం డైరెక్టర్ ఇ.మోహన్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రాముఖ్యత వివరించారు. సదస్సులో మేకా లోక్నాథ్, వివేకానంద రెడ్డి, విజయ్ కుమార్, నర్సింహ, సురేష్, అనిల్ సేన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. లా విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమోంటోలను అందజేశారు.