calender_icon.png 14 October, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులు అంటే కాంగ్రెస్ సర్కారుకు అలుసెందుకు??

14-10-2025 04:29:30 PM

తాండూరు (విజయక్రాంతి): గిరిజనులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అలుసు ఎందుకని... కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీకి గిరిజనులు గుర్తుకొస్తారా..? అంటూ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం టిఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకులు నారాయణ ఘాటుగా విమర్శించారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి తండాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన ఘనత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు.

పెద్దముల్ మండలం ఎర్రగడ్డ తండాలో పాఠశాల భవనం లేక విద్యార్థులు గ్రామపంచాయతీ భవనంలో విద్యను అభ్యసిస్తూ నానా అవస్థలు పడుతున్నారని, మధ్యాహ్న భోజనం మండుటెండలో చేస్తున్నా పలకరించే నాధుడే లేడని ఆరోపించారు. పాఠశాల భవన నిర్మాణం కేవలం పిల్లర్లకే పరిమితమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన తండాలపై చిత్తశుద్ధి లేకనే పాఠశాల భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఎర్రగడ్డ తండాలో అసంపూర్తిగా నిలిచిపోయిన పాఠశాల భవనాన్ని నిర్మించాలని ఆయన కోరారు.