05-05-2025 12:00:00 AM
ప్రభుత్వాలు మారితే పనులు మార్చాల్సిందేనా..?
మంచిర్యాల, మే 4 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ఒకే పనికి రెండేసి సార్లు శంకుస్థాపనలు చేస్తుండటం సహజమైంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ నాయకుల పేర్లు తప్ప గత పాలకు ల పేర్లు కనబడకుండా ఉండేందుకు ఇలా శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి ప్రారంభిస్తూ శిలాఫలకాలను మార్చుతున్నారం టూ మేధావి వర్గం చర్చించుకుంటుండగా, ప్రజలైతే నవ్వుకుంటున్నారు.
ఒకే పనికి రెం డు శంకుస్థాపనలు ఎందుకు? గతంలో మం జూరైన ప్రాజెక్టుల్ని కొత్త ప్రభుత్వం తమ క్రెడిట్‌గా మలచుకోవడం కోసమేనా? అం టూ పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాలు మొదలు పెట్టిన పనులను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, నాయకులు కొనసాగించడం ఆనవాయితీ. కాగా మంచిర్యాల జిల్లాలో అవేమి కనిపించడం లేదు.
మందమర్రి మండలం క్యాథన పల్లి వద్ద రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జి కోసం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించగా, ఏడాది కిందట జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ విజయం సాధించిన అనంతరం తిరిగి శంకుస్థాపనలు చేసి పూర్తయిన బ్రిడ్జిని ఇటీవల ప్రారంభించారు.
మంచిర్యాలలో సైతం గత ప్రభుత్వం ప్రారంభించిన పనులను నిలిపివేసి కొత్తగా అవే పనులకు కొంత మార్పు చేసి శంకుస్థాపనలు చేస్తుండటంతో ఈ కొత్త శైలిపై అధికార పార్టీపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాత పనులకు వేదికలు, పేర్లు మార్చి ప్రారంభోత్సవాలు: మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
గత బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైన పనులకు వేదిక లు, పేర్లు మార్చి తిరిగి ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదం. గత ప్రభుత్వంలో మంచిర్యాల ఐబి చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు చేపట్టాల్సిన రోడ్డు వెడల్పు పనులకు రూ.35 కోట్ల నిధులు మంజూరు కాగా 2023లోనే అప్పటి ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి పనులకు శంఖుస్థాపన చేశాం.
తిరిగి అదేపనిని కొంచెం మార్పు చేసి ప్రస్తుత ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉంది. ఈ పనులకు సంబంధించి 2023 సెప్టెంబర్ 1వ తేదీననే ఐబి నుంచి క్యాతనపల్లి వరకు రోడ్డు పనులకు రూ. 35 కోట్లు మంజూరు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పనులకు సంబంధించి గతంలో మంజూరైన ప్రొసీడింగ్ కాపీ సైతం ఉంది. ఇలా ప్రజలను మోసం చేయడం సబబు కాదు.