calender_icon.png 6 May, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన నీట్

05-05-2025 12:00:00 AM

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెకర్లు, ఎస్పీలు

కుమ్రం భీం ఆసిఫాబాద్/అదిలాబాద్/మంచిర్యాల, మే4( విజయ క్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్ర శాంతంగా ముగిసింది.

287 మంది విద్యార్థులు పరీక్ష  రాయాల్సి ఉండగా 272 మం ది పరీక్షకు హాజరైనట్లు నీట్ సమన్వయకర్త లక్ష్మీనరసింహ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష అనంతరం జవాబు పత్రాలను నిబంధనల ప్రకారం బందోబస్తు మధ్య తరలించారని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

38 మంది అభ్యర్థులు గైర్హాజరు..

అదిలాబాద్ జిల్లాలో నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1,659 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, వారికోసం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేశారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన 7 కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌లు సందర్శించారు. ఈ పరీక్షకు 1659 దరఖాస్తు చేసుకోగా, 1621 మంది అభ్యర్థులు హాజరుకగా, 38 మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. 

ప్రశాంత వాతావరణంలో..

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష మంచిర్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగింది. నీట్ పరీక్షకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజీవ్ నగర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 1,204 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 1,166 మంది అభ్యర్థులు హాజరయ్యారని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను నిబంధనల ప్రకారం పూర్తి బందోబస్తు మధ్య తరలించినట్లు తెలిపారు.