3 July, 2026 | 1:10 AM

కలెక్టర్ సుడిగాలి పర్యటన

03-07-2026 12:00 AM

ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ నర్సరీ పర్యవేక్షణ

పెద్దచెరువు కట్ట మినీట్యాంక్ బండ్ పనులు పునరుద్ధరణ పరిశీలన

మాచాపూర్ అంగన్వాడీ సెంటర్ తనిఖీ

ఎల్లారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సుడిగాలి పర్యటన చేశారు. ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సెంట్రల్ నర్సరీని పరిశీలించారు నర్సరీలో మొక్కల పెంపకం వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ పట్ల సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎల్లారెడ్డి డి ఎల్ పి ఓ, సురేందర్, నర్సరీలో చెట్ల పెంపకం వర్మీ కంపోస్ట్ తదితర అంశాలు జిల్లా కలెక్టర్‌కు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఎల్లారెడ్డి పట్టణంలో పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులు మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. సంబంధిత సమయానికి పనులు పూర్తి చేయాలని పనులు నాణ్యత లోపించకుండా చూసే బాధ్యత అధికారులదేనని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ను సన్మానించారు.

అనంతరం మాచాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంను పరిశీలించి పసపిల్లలతో ముచ్చటించారు. విద్యార్థులకు అందించే నాణ్యమైన భోజనం పట్ల ఆటంకం కలగకుండా చూడాలని ఆరోగ్య కార్యకర్తకు ఆదేశించారు. మతమాల గ్రామపంచాయతీ లోని పశువుల దావకానను పరిశీలించారు.

మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న సేవలు పట్ల సంబంధిత శాఖ అధికారులను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల పట్ల వైద్యులు చేస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి ఆటంకం కలగకుండా రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రొడ్డ ప్రభాకర్ తాసిల్దార్ ప్రేమ్ కుమార్ డి ఎల్ పి ఓ సురేందర్ ఎంపీడీవో తాహీరా బేగం పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.