calender_icon.png 28 November, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని ఎంపీకి వినతి

27-11-2025 12:00:00 AM

మేడ్చల్ అర్బన్, నవంబర్ 26 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టిపియుఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మల్కాజిగిరి బిజెపి పార్లమెంటు సభ్యులు  ఈటల రాజేందర్ ను కలిసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్  నుంచి మినహాయించాలని వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్ మాట్లాడుతూ శీతాకాల పార్లమెంటు సమావేశంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు జరిగేలా కృషి చేయాలని ఎంపి ఈటల రాజేందర్ ను కోరినట్లు నవీన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోడీ గారి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, జిల్లా సంఘటన కార్యదర్శి గోపాల్, సురేందర్, వెంకటేష్, మహేందర్, శ్రీనివాస్ రావు, తిరుపతి, సుధీర్, వెంకటరమణ, రామారావు  పాల్గొన్నారు.