17-05-2025 12:15:28 AM
ప్రొడ్యూసర్ నాగవంశీ బావమరిది రుష్య హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అదే ‘డాన్ బాస్కో’. శంకర్ గౌరి ఈ చిత్రానికి రచనాదర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శ్రీ మాయ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శైలేశ్ రమ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మిర్నా మీనన్ భాగమైన విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘జైలర్’, ‘నాసామి రంగ’ చిత్రాల్లో నటనతో మెప్పించిన మిర్నా ఈ సినిమాలో లెక్చరర్ సుమతి పాత్రలో కనిపించనుందట. ‘వెల్‌కమ్ టు ది క్లాస్ రీయూనియన్ బ్యాచ్ 2014. అన్ని రీయూనియన్‌లు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటానికే కాదు.. కొన్ని విమోచన గురించి కూడా’ అనే క్యాప్షన్ ఈ సినిమా కాన్సెప్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి డీవోపీ: ఎదురోలు రాజు; సంగీతం: మార్క్ కే రాబిన్.