calender_icon.png 18 May, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండోదరి పాత్రలో

17-05-2025 12:17:42 AM

గ్లామర్ పాత్రల్లోనే కాదు నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనూ అలరించిన అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఇప్పుడు విభిన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘కన్నప్ప’లో పార్వతీదేవిగా కనిపించనున్న ఈ బ్యూటీ మరో భక్తిరస చిత్రంలోనూ భాగమవుతోందట. ఈ విషయమే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

కాజల్ అగర్వాల్ ‘రామాయణ’లో భాగమైందనేదే ఈ ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో కాజల్ రావణాసురుడి సతీమణి మండోదరిగా కనిపించనుందట. మూవీ టీమ్ ఇప్పటికే కాజల్‌ను సంప్రదించిందని..

ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, గత వారం లుక్ టెస్ట్ సైతం జరిగిందంటూ ఆంగ్ల మీడియాలో వార్తలొచ్చాయి. ఇదే నిజమైతే కాజల్‌ను కన్నడ నటుడు యశ్‌కు జంటగా చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగనుందన్నమాట. యశ్ ఇందులో రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.