23-07-2025 07:27:41 PM
పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల తరగతుల బహిష్కరణ..
యూనివర్సిటీ క్రాస్ నుండి అశోక జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ..
అనంతరం అశోక జంక్షన్లో రాస్తారోకో..
హనుమకొండ (విజయక్రాంతి): ప్రైవేటు విద్యారంగంపై ఉన్న ప్రేమ ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యా రంగంపై ఉండదా అని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. బుధవారం జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా కేయూ క్రాస్ రోడ్ నుండి అశోక జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అశోక జంక్షన్ లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్, పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి నరసింహారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్, పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి రాచకొండ రంజిత్, పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, ఏఐఎస్బి జిల్లా కన్వీనర్ రోహిత్, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కన్వీనర్ మాస్ సావిత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఫల్యాల ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు అవుతున్న విద్యారంగానికి ఇచ్చిన హామీల నెరవేర్చలేదన్నారు.
రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని పరోక్షంగా అమలు చేస్తూ విద్యా రంగాన్ని బిజెపి చేతిలోకి పెట్టే కుట్రలు చేస్తుందని,రాష్ట్రంలో 2253ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం లేదని, 1500 పైగా పాఠశాలలో టాయిలెట్స్ లేవని, 28 వేల పైగా పాఠశాలలో కంప్యూటర్స్ లేవని, ఇంగ్లీష్ మీడియం ఇతర రాష్ట్రాల మీడియాలో మాదిరిగా కన్నడ, ఉర్దూ మలయాళం చదువుతున్న విద్యార్థులకు రావాల్సిన పాఠ్యపుస్తకాలు అందలేదన్నారు. రెండు జతలు యూనిఫామ్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక జత మాత్రమే ఇచ్చారని, ప్రభుత్వ పాఠశాలలో డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేశారని, ఇంకా 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు.
గత ప్రభుత్వం పాఠశాలలలో బ్రేక్ ఫాస్ట్ పథకం తీసుకొచ్చినా దానిని అమలు చేయడం లేదని, మధ్యాహ్నం భోజనానికి పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు ఇవ్వాల్సిన ఉన్నా వాటిని పెంచడం లేదని, లైబ్రరీలు, త్రాగునీరు, ప్రహరీ గోడలు, టాయిలెట్స్ అదనపు గదులకు నిధులు ఇవ్వలేదని, పాఠశాల విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో నెట్టి వేయబడిందన్నారు. ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీకి అడ్డూ, అదుపు లేదని, ఎల్ కేజీ నుండి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని, అడ్మిషన్లు పేరుతో డొనేషన్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మకాలతో లక్షల రూపాయల దందా కొనసాగిస్తున్నా ప్రభుత్వం నియంత్రం లేదన్నారు.
రాష్ట్రంలో తక్షణమే ఫీజు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామని, గురుకులల్లో కనీసం సౌకర్యాలు లేవని, అద్దెభవనాలు నడుస్తున్న 662 గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలోను తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని, తక్షణమే ఫీజు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని, ఇంటర్ విద్యాలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయాలి పాఠశాల విద్యాలో ఖాళీగా ఉన్న ఎంఈఓ డీఈవో పోస్టులను తక్షణమే భర్తీచేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర ప్రతిఘటనలు రేవంత్ ప్రభుత్వం ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఐ.స్టాలిన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ,జిల్లా సహాయ కార్యదర్శి బి రెడ్డి జశ్వంత్. గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్, కుక్కల కుమార్, వేల్పుల చరణ్, జిల్లా సహాయ కార్యదర్శి బొజ్జ జ్యోతి. జిల్లా సమితి సభ్యులు సిపతి వినయ్, అనిల్, రాథోడ్, రాజు, అమ్రిష్, అభినవ్ రెడ్డి, చరణ్, బన్నీ,పిడిఎస్ యు జిల్లా నాయకులు హనంకొండ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ జిల్లా కమిటీ సభ్యులు డానియల్ నాయకులు సాయి హర్షత్ పృథ్వి నందు సిద్దు అరుణ్, పిడిఎస్ యు, నాయకులు బి గణేష్, వినయ్ మరో పిడిఎస్ యు నాయకులు నాయకులు సాయి, ఏఐఎస్బి జిల్లా నాయకులు ఎండియాన్, ఏఐఎఫ్డిఎస్ నాయకులు పూల బోయిన రాజు పాల్గొన్నారు.