23-07-2025 07:29:48 PM
సిద్దిపేట క్రైమ్: వర్షాల దృష్ట్యా సిద్దిపేట పట్టణ ప్రజల సౌకర్యార్థం మాన్సూన్ టీం ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్(Municipal Commissioner Ashrith Kumar) తెలిపారు. ఈ టీం సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని, మున్సిపల్ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే 9505507248 నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలపాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తామన్నారు. పట్టణంలో శిథిలావస్థకు చేరిన గృహాల యజమానులకు నోటీసులు జారీ చేసి, ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. బుధవారం ఆయన పట్టణంలోని 1వ వార్డు లింగారెడ్డిపల్లిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురుగు కాలువలను శుభ్రం చేయించి పిచ్చి మొక్కలు, చెత్త తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ సిబ్బందికి గ్లౌజులు, బూట్లు, రెయిన్ కోట్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.