calender_icon.png 4 August, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఉపేక్షించేది లేదు

15-04-2025 08:40:02 PM

మంథని ఎస్ఐ డేగ రమేష్..

మంథని (విజయక్రాంతి): మంథని పట్టణం, మండలంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే ఉపేక్షించేది లేదని మంథని ఎస్ఐ డేగ రమేష్ ప్రకటనలో తెలిపారు. మత విద్వేషాలు, ధర్నాలు రాస్తారోకోలు అనుమతి లేకుండా ఎవరైనా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీ నిర్వహించరాదన్నారు. డీజే లకు అనుమతి లేదని, డ్రోన్ కెమెరాలను ఎగరవేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎవరైనా నిరసనలు, దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.