26-07-2025 08:44:24 PM
కాసిపేట,(విజయక్రాంతి): మండలంలోని ఎరువుల దుకాణాలను మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ శని వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ముత్యంపల్లి, కాసిపేట, కోమటిచెను, దేవాపూర్ గ్రామాలలోని ఎరువుల దుకాణాలను సందర్శించి ఎరువుల పంపిణీనీ, స్టాక్ రిజిస్టర్, బిల్స్ ఇతర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సీహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ ఎరువుల దుకాణాల వద్ద స్టాక్ బోర్డ్ ఏర్పాటు చేసి స్టాక్ వివరాలు, ధర వివరాలు తెలియాజేయాలని, రైతులు యూరియా అడిగితే ఇతర ఎరువులు లింక్ పెట్టి ఇవ్వరాదని, డీలర్స్ ఎట్టి పరిస్థితుల్లో యూరియా, ఇతర ఎరువులను అధిక ధరలకు అమ్మవద్దని, అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా, ఇతర ఎరువులను బ్లాక్ చేయవద్దని, యూరియాను అనధికార చర్యలకు వినియోగించవద్దన్నారు.