09-07-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ టౌన్ 8 : కార్మికుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా లక్ష్యంగా పె ట్టుకుని సకల కార్మికులం అందరం కలిసి సమ్మె చేద్దామని ట్రేడ్ యూనియన్ల నాయకులు సిఐటి యు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, టీయూసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్, టీఎన్టీయూసీ జిల్లా నాయకులు డి. రాములు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ. రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ పిలుపునిచ్చారు.
బుధవారం నిర్వహించే సమ్మెకు ప్రతి ఒక్క కార్మికులు హాజరుకావాలని పిలుపుని చ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బుధవారం నిర్వహించిన సమ్మెకు సంబంధించిన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మన సమస్యలను ప్రభుత్వంతో తీసుకు పోతేనే పరిష్కారం దిశగా ముందుకు సాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత నాయకులు ఉన్నారు.