ఎయిడ్స్ భూతాన్ని తరిమికొడుదాం
03-12-2024 01:53 AM
నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, డిపెంబర్ 2 (విజయక్రాంతి): సమాజం నుంచి ఎయిడ్స్ భూతాన్ని తరిమికొట్టే బాధ్యత ప్రతి ఒక్కరిదని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిడ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీని నిర్మల్ ఆర్డీవో కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
వైద్య విద్యార్థులు, ప్యారా మెడికల్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎయిడ్స్ నివారణకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రత్నకల్యాణి, జిల్లా వైద్యాధికారి రాజేందర్ పాల్గొన్నారు.






