02-05-2025 12:00:00 AM
సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం
వైరా, మే 1(విజయక్రాంతి): చికాగో నగరంలో పెట్టుబడి దారుల తుపాకులకు ప్రాణాలను బలిదానం చేసిన కార్మికుల పోరాట చరిత్రను, త్యాగాలను స్మరించు కుంటూ మే డే పోరాట స్పూర్తితో శ్రమ దోపిడీ, అసమానతలు, సామ్రాజ్యవాదం, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా కార్మికులు నిరంతరం పోరాడాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపు నిచ్చారు.
సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మే డే ఘనంగా నిర్వహించారు. అనంతరం డప్పు దళంతో వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు సిఐటియూ, పార్టీ జెండాలను ఎత్తుకుని మే డే వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి నినదిస్తూ వైరా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భూక్యా వీరభద్రం రిక్షా తోక్కి కార్యకర్తలను ఉత్తేజ పరిచారు..
ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు.
లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ దేశంలో అలజడిని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కార్మికులందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలన్నారు. మే డే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై ఐక్యంగా పోరాడుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, డివిజన్ కమిటీ సభ్యులు దోడ్డపనేని కృష్ణార్జునరావు, తూము సుధాకర్, నాయకులు, హరి వెంకటేశ్వరరావు, గుడిమెట్ల రజిత, బొంతు సమత, గుమ్మా నరసింహారావు, గుడిమెట్ల మోహన్ రావు, అనుమోలు రామారావు, కొంగర సుధాకర్, కామినేని రవి, ఎస్.కె నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, షేక్.జమాల్ సాహేబ్, తదితరులు పాల్గొన్నారు.