calender_icon.png 19 May, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశాంగ మంత్రి జైశంకర్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

19-05-2025 02:53:36 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): విదేశాంగ మంత్రి జైశంకర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. తన ప్రశ్నలకు జైశంకర్ సమాధానం చెప్పట్లేదన్నారు.  వాస్తవాలు తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉందని, మే 7వ తేదీన జరిగిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత్ సైనికులు చేసిన దాడి ప్రారంభంలోనే పాకిస్థాన్ కు సమాచారం ఇవ్వడం నేరమని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ కు ముందే సమాచారం తెలియడంతో మనం ఆపరేషన్ సందూర్ లో ఎన్ని విమానాలు కోల్పోయాం..?, విమానాల అంశంపై జైశంకర్ ఇప్పటికైనా మౌనం వీడాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.ఇది ఒక తప్పిదం కాదు.. ఇది ఒక నేరం.. దేశం సత్యాన్ని తెలుసుకోవాలి, అని రాహుల్ ట్వీట్ చేశారు.