19-05-2025 02:57:06 PM
నాగారం: రోడ్డు ప్రమాదంలో ఒక్కరికి గాయాలైన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామ శివారులోని సూర్యాపేట - జనగాం జాతీయ 365 బి రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన ప్రకారం... సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఇస్తలపురం గ్రామానికి చెందిన మున్న ప్రవీణ్ పల్సర్ 125 బైక్ పై తిరుమలగిరి వైపు వెళ్తూ అటువైపు వెళుతున్న లారీకి వెనుక భాగంలో వేగంగా ఢీకొట్టడంతో ఎడమ కన్ను భాగంలో బలమైన గాయం కావడంతో నాగారం మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి గాయపడిన వ్యక్తి (108) అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు తెలిపారు.