13-09-2025 07:07:25 PM
నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..
కరీంనగర్ (విజయక్రాంతి): ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న ప్రజాపాలనను, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ యొక్క చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కార్పోరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(City Congress President Komatireddy Narender Reddy) పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డిసిసి అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ ను ఆనుకొని ఉన్న చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యంతో పాటు అందరి పర్యవేక్షణలో కరీంనగర్ కార్పోరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని దీంట్లో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు.
స్థానిక నాయకులు డివిజన్లలో కథానాయకులై పని చేయాలని అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా చూడాలని ప్రతి ఇంటిని టచ్ చేయాలని నగరంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే అవకాశం ఉందని, డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులకు దక్కేలా చూడాలని, బతుకమ్మ చీరలు పంపిణీ లో భాగస్వామ్యం కావాలని సూచించారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు ఆరెపల్లి మోహన్, సెల్స్ అధ్యక్షులు ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, సమద్ నవాబ్, లాయక్, జీడి రమేష్, చర్ల పద్మ, ఖమ్రోద్దీన్, ఎలగందుల మల్లేశం, కుర్ర పోచయ్య, అబ్దుల్ రహమాన్ అన్ని డివిజన్ల అధ్యక్షులు, ఇంచార్జులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.