13-09-2025 07:05:55 PM
అమీన్ పూర్,(విజయక్రాంతి): బచ్పన్ ఏ హెచ్ పి ఎస్ ప్రైమరీ బీరంగూడలో గ్రాండ్పేరెంట్స్ డే ను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుకకు పాఠశాల డైరెక్టర్లు సిహెచ్ శ్రీనీవాస్ రావు, శిరీషా రెడ్డి, ప్రిన్సిపాల్ లక్ష్మీ రాఘవేంద్ర హాజరై చిన్నారులను, పెద్దలను ప్రోత్సహించారు. పిల్లలు తమ తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలకు అంకితముగా అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేసి వేదికను ఆనందంతో నింపారు. ఆకర్షణీయమైన ర్యాంప్వాక్, పలు ఆటలు నిర్వహించబడ్డాయి.
ఆటలలో పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చూపారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేయబడ్డాయి. తరువాత తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు తమ అనుభవాలను పంచుకొని మనవలు–మనవరాళ్లతో గడిపే మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. కొందరు పాటలు పాడగా, మరికొందరు నృత్యాలు చేసి వేదికను ఆనందోత్సాహాలతో మార్మోగించారు. ఈ సందర్భంగా పిల్లలు తమ పెద్దల పట్ల గౌరవం, కృతజ్ఞత, ప్రేమను వ్యక్తపరిచారు.