calender_icon.png 22 July, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌ను అగ్రగామి చేద్దాం

13-07-2024 12:43:20 AM

ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): భారత్‌లో మేకర్ కావడం చాలా సులభమని ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఉత్పత్తిదారుడిగా కావడానికి ఎవరు ఎక్కడికీ వెళ్లొద్దని, ఇక్కడే రాణించాలని కోరారు. అలా గే ఉత్ప త్తి ఆవిష్కరణలో భారతదేశా న్ని అగ్రగామిగా చేద్దామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కణలపై టీ-వర్క్స్ శుక్రవారం సదస్సు నిర్వహించింది. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి మేక్ ఇట్ మెట్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈవెంట్‌లో ముఖ్యఅతిథులుగా జయేష్‌రంజన్, ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి, ఐటీశాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు.