calender_icon.png 12 January, 2026 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుడికిల్ల పాఠశాలలను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుదాం

12-01-2026 12:00:00 AM

మై హోమ్ ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వర్ రావు

కొల్లాపూర్ రూరల్, జనవరి 11: కొల్లాపూర్ మండల కేంద్రంలోని కుడికిల్ల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, హైస్కూల్లను ఆదివారం మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రతినిధి జూపల్లి రామేశ్వరం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుడికిల్ల ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలల అభివృద్ధిపై ఉపాధ్యాయులతో చర్చించి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కుడికిల్ల సర్పంచ్ జూపల్లి రఘుపతిరావు చొరవతో చర్యలు తీసుకుందామన్నారు. గ్రామంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

గ్రామాభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి, కుడికిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు. అనంతరం స్థానిక ఎన్నికల్లో నూతనంగా సర్పంచిగా గెలుపొందిన జూపల్లి రఘుపతిరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామేశ్వరావు గారి సోదరుడు జూపల్లి జనార్ధన్రావు, డాక్టర్ రామేశ్వరావు గారి వ్యక్తిగత కార్యదర్శి వెంకట్రావు, ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం చెన్నయ్య, హైస్కూల్ హెచ్‌ఎం మల్లికార్జున్, గ్రామ ఉపసర్పంచ్ మల్లేష్ యాదవ్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.