25-12-2025 02:59:13 AM
డిప్యూటీ కమిషనర్ చంద్ర ప్రకాష్ రెడ్డి
మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 24( విజయ క్రాంతి): మేడ్చల్ జిహెచ్‌ఎంసి పరిధిలోని సర్వేనెంబర్ 1133 లోని ఎఫ్ టి ఎల్ ఉన్న 22 వ రేషన్ షాప్ ను తరలించాలని డిప్యూటీ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి పౌరసరఫరాల అధికారులకు లేఖ రాశారు.
తుమ్మ చెరువు ఎఫ్టిఎల్లో 22 వ నెంబర్ గల రేషన్ షాపు కార్యకలాపాలు సాగిస్తుందని ఆంజనేయులు ప్రజావాణిలో దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు 22 నెంబర్ గల రేషన్ షాపును అక్కడి నుండి తరలించాలంటూ డిప్యూటీ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి పౌర సరసర శాఖ అధికారిని కోరారు. ఎఫ్ టి ఎ ల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుపవద్దని ఆంజనేయులు అనే వ్యక్తి ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్డీఎల్ లో ఉన్న షాప్ నెంబర్ 22ను వెంటనే తరలించాలని కోరారు.