calender_icon.png 14 August, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుదాం

14-08-2025 02:05:51 AM

- హర్‌ఘర్ తిరంగా యాత్రలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

- హాజరైన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్

ముషీరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): ఆగస్టు15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకోవాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.  హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా బుధవారం బండారు వైష్ణవ్ ఫౌండేషన్, అలాయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాంనగర్ లోని బండారు దత్తాత్రేయ నివాసం నుంచి బాగ్ లింగంపల్లి వరకు తలపెట్టిన తిరంగా యాత్రను ఆయన జాతీయ జెండాను ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వీర జవాన్లను స్మరించుకోవాలని ఆయన సూచిం చారు.   ఆగస్టు15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని  ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు బి. శ్యాంసుందర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆనంద్ గౌడ్, బీజేపీ, ఓబీసీ మోర్చా  నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరంగా యాత్రను విజయవంతం చేశారు.

ఇదిలా ఉండగా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెవైఎం నగర అధ్యక్షుడు శివాజీ  ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రకు ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు, ఎం.పి రాజ్యసభ డాక్టర్ కె. లక్ష్మణ్ హాజరై  తీరంగా ర్యాలీని ప్రారంభించారు. గాంధీనగర్ డివిజన్, అశోక్ నగర్ సర్కిల్ నుండి ప్రారంభమైన ర్యాలీ ట్యాంక్ బండ్ వద్ద వున్న స్వామి వివేకానంద విగ్రహం వరకు సాగింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అద్యక్షులు జి. భరత్ గౌడ్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, కనకుంట్ల హరి, నందు, బీజేపీ, బిజెవైఎం, అన్ని మోర్చల రాష్ట్ర, జిల్లా నియోజకవర్గం నాయకులతో పాటు కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీగా హాజరైయ్యారు.