calender_icon.png 14 August, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లంపల్లి - జాతీయ రహదారి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి

14-08-2025 02:04:04 AM

కలెక్టర్  దివాకర్

ములుగు, ఆగస్టు13(విజయక్రాంతి): మల్లంపల్లి నుండి ములుగు జాతీయ రహదారి మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇటీవలి భారీ వర్షాల ప్రభావంతో జాతీయ రహదారి-163 పై మల్లంపల్లి మరియు జాకారం మధ్య ఉన్న ఎస్‌ఆర్ ఎస్పీ కెన్పా పాత వంతెన దెబ్బతింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవే అధికారులు తాత్కాలిక వంతెన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

తాత్కాలిక వంతెన పూర్తయ్యే వరకు డైవర్షన్ మార్గాలు తాత్కాలిక వంతెన పనులు పూర్తయ్యే వరకు మల్లంపల్లి-ములుగు మార్గంలో వాహన రాకపోకలు క్రింది విధంగా మళ్లించబడతాయి. ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి సూచించిన మార్గాలను అనుసరించాలి.

1. వరంగల్ ములుగు (భారీ వాహనాలు) వెళ్లే దారి: గూడెప్పాడు, పరకాల, రేగొండ  తిరుగు దారి: జంగాలపల్లి 

2. వరంగల్ (RTC బస్సులు, కార్లు, టూ వీలర్లు) వెళ్లే దారి: మల్లంపల్లి తిరుగు దారి: జాకారం

3. నర్సంపేట (ఆర్ టీసీ బస్సులు, కార్లు) వెళ్లే దారి: మల్లంపల్లి తిరుగు దారి: పందికుంట- శ్రీనగర్ -మల్లంపల్లి

4. నర్సంపేట -ములుగు (భారీ వాహనాలు) వెళ్లే దారి: వరంగల్ -గూడెప్పాడు -పరకాల-రేగొండ-జంగాలపల్లి: తిరుగు దారి: జంగాలపల్లి రేగొండ-పరకాల గూడెప్పాడు-వరంగల్ ఆర్ టీసీ ప్రయాణికుల సౌకర్యం, ఆర్ టీసీబస్సులు మల్లంపల్లి శ్రీనగర్ పందికుంట గ్రామాల ద్వారా మళ్లించబడతాయి. ఈ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి లేదు.