calender_icon.png 18 November, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి ఒడిలో సేదతీరుదామా..

09-03-2025 12:00:00 AM

ప్రకృతి ప్రేమికులకు తమిళనాడు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఇక్కడి ఎత్తున పర్వతాలు, అందమైన నదులు, జలపాతాలు చూపరులను కట్టిపడేస్తాయి. కాఫీ తోటల మధ్య ప్రయాణం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి చల్లని ప్రదేశాలకు వెళ్లి జాలీగా గడిపేందుకు ప్రణాళికలు వేస్తుంటారంతా. మనకు సమీపంలోనే ప్రకృతి అందాలకు నెలవైన ఎన్నో అద్భుతమైన ప్రాంతాలున్నాయి. వాటిలో ఒకటి తమిళనాడు. 

సముద్ర మట్టానికి 2,133 మీటర్ల ఎత్తులో ఉన్న కొడైకెనాల్ పళని కొండలకు దక్షిణాన ఉంది. ఈ ప్రాంతం సహజ సౌందర్యానికి, జలపాతాలకు, ట్రె క్కింగ్‌కు ప్రసిద్ధి. మీరు కొడైకెనాల్ వెళితే కోకర్స్ వాక్, సిల్వర్ క్యాస్కేడ్, కోడై సరస్సును సందర్శించడం మర్చిపోవద్దు. 

కూనూర్: ఊటీకి కేవలం 18 కిలోమీటర్ల ఉంటుంది కూనూర్ నీలగిరి కొండలలో రెండో అతి పెద్ద హిల్ స్టేషన్. ఈ ప్రాం తం నీలగిరి టీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి టీ తోటలు, సిమ్స్ పార్క్, డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్‌ల మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్ పంచుతాయి. 

వల్పరై: తమిళనాడులో అంతగా తెలియని హిల్ స్టేషన్ వల్పరై. ఈ ప్రాంత మంతా తేయాకు తోటలు, జలపాతాలు, సుందరమైన లోయలతో నిండి ఉంటుం ది. వేసవిలో ఈ అందమైన ప్రాంతాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే. 

హోగేనక్కల్: ప్రసిద్ధ నది కావేరి వివిధ జలపాతాలుగా విడిపోయే ప్రదేశం హోగేనక్కల్. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని నదీ తీరాన ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడి జలపాతాల అందాలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. దీనిని భారతదేశ నయాగార జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ అందమైన ప్రాంతం స్వర్గం కంటే తక్కువ కాదు అంటారు చూసినవాళ్లు. 

ఇలా ప్లాన్ చేసుకోండి.. 

బస్సు: బస్సు ప్రయాణానికి చాలా ఖర్చవుతుంది. కాని, హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల నుంచి చెన్నై లేదా కోయంబత్తూర్‌కు నేరుగా బస్సులో చేరుకోవచ్చు. ఆపై మీకు నచ్చిన హిల్ స్టేషన్ చేరుకోవడానికి స్థానిక బస్సును ఎంచుకోవచ్చు. ఛార్జీ ఖర్చు మొత్తం ఒక్కొక్కరికి 2 వేల వరకూ అవుతుంది.