24-10-2025 12:00:00 AM
చిన్నచింతకుంట అక్టోబర్ 23 : అభివృద్ధికి అండగా ఉంటూ అడుగులు వేద్దామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అ న్నారు. మండల పరిధిలోని దమగ్న పూర్ గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహంలో బి ఆర్ ఎస్ నేతలు భారీ ఎత్తున చేరుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మె ల్యే కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్ర జలకు సేవ చేసేందుకు రాజకీయాలకు వ చ్చానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అ హర్నిశలు పనిచేస్తున్నానని, పారిశ్రామికంగా వెనుకబడ్డ దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దే శంతో పనిచేస్తున్నానన్నారు.
అందులో భా గంగా బ్రహ్మోస్ మిస్త్స్రల్ తయారీ యూనిటీ సంబంధించి అధికారులు స్థల పరిశీలన చే శారని, రెండు రోజుల క్రింద ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించానని, మిస్త్స్రల్ యూనిట్ ఏర్పాటుకు సీఎం ఉచితంగా భూ మిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపారని, త్వరలో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ఇక్కడ ఏర్పాటు అవుతుందని, అడ్డాకులకు డ్రై పోర్ట్ రాబోతుందని అన్నారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందించారు.