calender_icon.png 24 October, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డును విస్తరించకుండా డివైడర్ నిర్మాణం

24-10-2025 12:00:00 AM

అస్తవ్యస్తంగా ఆర్‌అండ్‌బీరోడ్డు పనులు 

మహబూబాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలిక ఊడిందన్న చందంగా ఆర్ అం డ్ బి శాఖ అధికారుల తీరు మారిందనే విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియాలో నూతనంగా ఆర్ అండ్ బీ రోడ్ల విస్తరణ పనులు చేపట్టా రు. కనీసం 66 అడుగుల రోడ్డు విస్తరణ పూ ర్తి చేసిన తర్వాత డివైడర్లు నిర్మించాల్సి ఉం డగా, ఆ పనులు పక్కనపెట్టి డివైడర్ నిర్మిస్తుండడంతో ప్రస్తుతం ఉన్న రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారింది.

కేసముద్రం ప్రభుత్వ జూని యర్ కళాశాల నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన ఆర్ అండ్ బి శాఖ అధికారులు, గుత్తేదా రు చిత్తం వచ్చినట్లు పనులు చేస్తున్నట్లు ప్ర జలు విమర్శిస్తున్నారు. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు ముందుగా 66 అడుగుల రోడ్డు ను విస్తరించే పనులకు శ్రీకారం చుట్టగా పలుచోట్ల ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిం ది.

అయితే పనులను నిలిపివేయకుండా అ ధికారులు అనుకూలంగా ఉన్నచోట కంకర పోసి , విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తం భాలను పక్కకు తొలగించకుండా ముందు గా డివైడర్ పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ఇరుకుగా ఉన్న రోడ్డు పై మధ్యలో డివైడర్ నిర్మించడం వల్ల రోడ్డు ఇరుకుగా మారి భారీ వాహనాల రాకపోకలకు అడ్డంకి గా మారింది.

ఇదిలా ఉంటే కొ న్నిచోట్ల రోడ్డు వెంట ఉన్న కాలనీలు, ఆవాస ప్రాంతాలకు వెళ్లడానికి మధ్యలో డివైడర్ కు కటింగ్ ఇవ్వకుండా రోడ్డు పొడవునా డివైడర్ నిర్మించడం వల్ల ఆయా ఆవాస ప్రాం తాల ప్రజలు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే కేసముద్రం మహబూబాబాద్ నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టి మధ్యలో వదిలేశారు.

దీని తో అనేక చోట్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడి బైపాస్ రోడ్డు వాహనాల రాకపోకలకు వెళ్లడానికి అనువుగా లేకుండా పోయింది. దీని తో పట్టణ నడిబొడ్డు నుండి భారీ వాహనా లు వెళుతుండడంతో తరచుగా ఇరుకు రో డ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఇక రైల్వే ఫ్లైఓవర్ కు ఇరువైపులా ఆక్రమణలను తొలగించకుండానే తారు రోడ్డు వేస్తున్నారు. గతంలో 100 అడుగుల రోడ్డుకు స్థల సేకర ణ చేపట్టి భూ నిర్వాసితులకు డబ్బులు చె ల్లించినప్పటికీ కొన్నిచోట్ల ఆక్రమణలు తొలగించలేదని విమర్శలు వస్తున్నాయి. ఇంకొ న్ని చోట్ల అక్రమంగా రోడ్డు స్థలంలో నిర్మాణాలు జరిగినప్పటికీ వాటిని తొలగించకుం డా రోడ్డు వేయడం విమర్శలకు తావిస్తోంది.

నిబంధనల ప్రకారం పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి మహాత్మ జ్యోతిబాపూలే విగ్ర హం వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటికీ , కొన్నిచోట్ల రోడ్ల ఆక్రమణలను చూసి చూడకుండా వదిలేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి అర్ధాంతరంగా వదిలేశారు.

అలాగే అంబేద్కర్ సెంటర్ నుండి కోరుకొండ పల్లి క్రాస్ రోడ్ వరకు కూడా పనులు చేపట్టి మధ్యలో వదిలేశారు. దీనితో పట్టణంలో ప్రజలు అసంపూర్తి రోడ్లతో, అస్తవ్య స్తమైన పనులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా రోడ్డు విస్తరించకుండా ఇష్టానుసారంగా పనులు చేయడం వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడటం అటుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. 

వెంటనే ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్న రోడ్ల విస్తరణ పనులను సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్లను పరిశీలించి ఇబ్బందులు తొలగిస్తాం

ఇబ్బందికరంగా మారిన రోడ్ల విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు వేసే పనులను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయి పర్యటన చేసి ఇబ్బందులు ఉన్నచోట సరిచేసి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. 

భీమ్లా, ఈ ఈ ఆర్ అండ్ బి శాఖ, మహబూబాబాద్