02-09-2025 03:05:17 PM
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్తం..
ఇంద్రవెల్లి (విజయక్రాంతి): పేదల ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్థాయిగా నిలిచారని ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం(Market Committee Chairman Mukhadhe Uttam) పేర్కొన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్ 16వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఉత్తం మాట్లాడుతూ... పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత వైయస్ఆర్ అని తెలిపారు. జీవితాంతం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పాటు పడ్డారని, కాంగ్రెస్ హయంలో చరిత్రాత్మకమైన పథకాలను అమలు చేశారన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి జహీర్, సోమోరే నాగోరావు, మీర్జా యాకూబ్ బెగ్, సోమాసే కిషోర్ కుమార్, వరుణ్ ఫడ్ పాటిల్, సోన్ కాంబ్లే జితేందర్, ఎండి.జూనేద్, సోన్ కాంబ్లే తదితరులు ఉన్నారు