calender_icon.png 2 September, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులు

02-09-2025 03:02:30 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) 16వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక ప్రభుత్వ పథకాల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చిలుముల శంకర్, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రొడ్డ శారద, మాజీ పట్టణ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, కాంగ్రెస్ సేవాదళ్ మాజీ జిల్లా అధ్యక్షులు బండి రాము, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ దేవసాని ఆనంద్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.