07-08-2025 12:00:00 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ ఆగస్టు 6:(విజయ క్రాంతి): పెరుగుతున్న కాలుష్యన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క హిందువు మట్టి గణపతిని పూజించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీ రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మట్టి గణపతి విగ్రహ తయారీకి భూమి పూజ చేశారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ 54 అడుగులతో తెలంగాణలో అతిపెద్ద మట్టి గణపతి నిర్మిస్తు ఆదర్శంగా నిలుస్తున్న రవితేజ యాత్ సొసైటీని ఆయన అభినదించారు. బ్రిటిష్ పరిపాలనలో భారతీయులలో జాతీయ స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో మొదలైన గణేష్ నవరాత్రులు నేడు హిందువులు జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగగా చిన్న, పెద్ద అందరూ కలిసి జరుపుకోవడం హిందూ ధర్మానికి నిదర్శనం.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను హిందువులు ఉత్సాహంగా నియమ,నిష్టలతో జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో దాదన్న గారి విట్టల్ రావు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, రవితేజ యూత్ సొసైటీ అధ్యక్షులు నీలగిరి రాజు, కన్వీనర్ కిరణ్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మినారాయణ, మాయావర్ సాయిరాం, ఆనంద్, పవన్, పల్నాటి కార్తీక్, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు