05-01-2026 05:42:43 PM
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంపై దాడి జరిగింది. దుండగుడు జేడీ వాన్స్(US Vice President JD Vance house attacked ) ఇంటిపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో జేడీ వాన్స్ ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. జేడీ వాన్స్ ఒహాయోలోని నివాసంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అధికారి చెప్పిన ప్రకారం, ఈ ఘటన జరిగిన సమయంలో వాన్స్ కుటుంబం ఇంట్లో లేదని అధికారులు వెల్లడించారు. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, ఈ సంఘటన జరిగినప్పుడు వాన్స్ కుటుంబం ఇంట్లో లేదు. ఒహాయోలోని ఉపాధ్యక్షుడి ఇంటి ప్రాంగణంలోకి ఎవరూ ప్రవేశించారని తాము భావించడం లేదని ఒక ఫెడరల్ చట్ట అమలు అధికారి తెలిపారు.