calender_icon.png 16 May, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

16-05-2025 12:53:17 AM

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల, మే15 (విజయక్రాంతి): గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలని, యువత, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల గాంధీనగర్ ప్రైమరీ స్కూల్, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రూ. 8 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటి ఏర్పాటు, అభివృద్ధి కోసం ప్రణాళిక యుతంగా కృషి చేస్తానన్నారు. లైబ్రరీ సెస్ ద్వారా లైబ్రరీల ఏర్పాటు, అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రూ. 35 లక్షలతో రాయికల్ పట్టణం, సారంగాపూర్, చలిగల్లో సైతం గ్రంధాలయాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

రూ.  1 కోటితో జిల్లా కేంద్రం ధరూర్ క్యాంప్లో గ్రంథాలయం నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 11 వ ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్ కూడ జగిత్యాలలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. గాంధీనగర్లో రూ. 18 కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్డు నిర్మించామని, రూ. 16 కోట్లతో జగిత్యాల తిప్పన్నపేట రహదారి మంజూరు చేయటం జరిగిందన్నారు.

జగిత్యాల పట్టణంలో లే-అవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టి  పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డిఈ నాగేశ్వర్, ఏఈ శరన్, నాయకులు బాలే శంకర్, ఆనంద్ రావు, పంబాల రామ్ కుమార్, ముస్కు నారాయణరెడ్డి, డిష్ జగన్, చెట్పల్లి సుధాకర్, కోలగని సత్యం, కూతురు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.