16-05-2025 01:39:19 AM
న్యూఢిల్లీ, మే 15: రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదం పొందిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన బిల్లులు కూడా తీవ్ర ఆలస్యం కావడంపై ఇటీవల సుప్రీం కోర్టు గవర్నర్లు, రాష్ట్రపతికీ గడువు విధిస్తూ తీర్పు నిచ్చింది. శాసనసభలు పంపిన బిల్లులపై మూడునెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం గడువు విధించింది.
ఈ విష యంపై ఇప్పటికే అనేక మంది రాజ్యాంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. తాజాగా గురువారం రాష్ట్రపతి ముర్ము సుప్రీం కోర్టు నిర్ణయంపై స్పం దించారు. రాజ్యాంగం రాష్ట్రపతులకు కల్పించిన ఆర్టికల్ 143 ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకు ప్రథమ పౌరురాలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
బుధవారమే జస్టిస్ బీఆర్. గవాయ్ సుప్రీం కోర్టు నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన విష యం తెలిసిందే. తమిళనాడు రాష్ట్ర అసెం బ్లీ ఆమోదించిన అనేక బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదం టూ ఆ రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్ 12న తీర్పునిస్తూ.. మూడు నెలల గడువును విధిం చింది. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు న్యాయవ్యవస్థ పరిధిలోకి వస్తాయని సుప్రీం అభి ప్రాయపడింది. గవర్నర్లు బిల్లులపై ఆల స్యం చేస్తే రాష్ట్రాలు సుప్రీం కోర్టుని ఆశ్రయించవచ్చని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం తీర్పునిచ్చింది.
రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలివే..
1) ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు బిల్లు సమర్పించినపుడు అతడి ముందు ఉన్న ఎంపికలు ఏమిటి?
2) ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు బిల్లును సమర్పించినపుడు గవర్నర్ క్యాబినెట్ సలహా మేరకు మాత్రమే చర్యలు తీసుకోవాలా?
3) ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న విచక్షణాధికార నిర్ణయం న్యాయ పరిశీలను లోబడి ఉంటుందా?
4) ఆర్టికల్ 200 కింద గవర్నర్ నిర్ణయాలు కోర్టుల సమీక్ష, విచారణల నుంచి ఆర్టికల్ 361 కాపాడుతుందా?
5) గవర్నర్ ఎంత సమయంలో నిర్ణ యం తీసుకోవాలనే దానిపై రాజ్యాంగం లో కాలపరిమితి లేనపుడు బిల్లులపై నిర్ణయానికి న్యాయవ్యవస్థ గడువు విధించొచ్చా?
6) ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి ఉండే విచక్షణాధికారాన్ని న్యాయపరంగా సమీక్షించవచ్చా?
౭) రాజ్యాంగం ప్రకారం ఎటువంటి ఆదేశాలు లేనపుడు న్యాయపరంగా సూచించిన గడువుకు రాష్ట్రపతి కట్టుబడి ఉంటారా?
౮) రాష్ట్రప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ రిజర్వ్ చేసి.. ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్నపుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కోరాలా?
౯) బిల్లు చట్టంగా మారేటపుడు గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా?
౧౦) రాష్ట్రపతి లేదా గవర్నర్ ఏవేని నిర్ణయాలు తీసుకోవడానికి లేదా మార్పు లు చేసేందుకు ఆర్టికల్ 142 కింద అనుమతి ఉందా?
౧౧) అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా చట్టంగా మారుతుందా?
౧౨) రాజ్యాంగ సవరణ ప్రశ్నలను ఆర్టికల్ 145 (3) ప్రకారం.. ముందుగా రాజ్యాంగ ధర్మాసనాలకు సూచించాలా?
౧౩) ఆర్టికల్ 142 ప్రకారం.. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా, కోర్టు తీర్పులను వెలువరిస్తుందా?
౧౪) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివాదాలను సుప్రీం కోర్టు పరిధి నిర్దేశించే ఆర్టికల్ 131 పరిధిలో కాకుండా పరిష్కరించవచ్చా?
ఏదేని రాష్ట్ర అసెంబ్లీ, మండలి ఆమోదించిన బిల్లు చట్టంగా మారాలంటే గవర్నర్, రాష్ట్రపతి సంతకాలు తప్పనిసరి. ఈ బిల్లులను వెనక్కి పంపేందుకు, లేదా అట్టి పెట్టుకునేందుకు పలు రకాల వీటో అధికారాలను కూడా రాజ్యాంగం కల్పించింది.