calender_icon.png 16 May, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ ఆఫర్ జీరో టారిఫ్?

16-05-2025 01:22:48 AM

ప్రాథమిక దశలో వాణిజ్య ఒప్పందం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు: విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

ట్రంప్ మాటలకు అర్థాలే వేరు!

న్యూఢిల్లీ, మే 15: అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ మాటలకు అర్థాలే వేరు అని మరోసారి రుజువైంది. ఖతార్ పర్యటనలో ఉన్న ట్రంప్ తమకు భారత్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందని ప్రకటించారు. తమ దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకునే అనేక రకాల వస్తువులపై సుంకాలు ఎత్తేసే విధంగా ప్రతిపాదించిందన్నారు. అయితే ఈ ఒప్పందం ప్రాథ మిక దశలోనే ఉందని, ఆయన పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ఎటువంటి వస్తు వులకు వర్తిస్తుందని మాత్రం ట్రంప్ వివరించకపోవడం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యలపై గురువారం స్పందించిన భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఇంకా తుది దశకు చేరుకోలేదన్నారు. జైశంకర్ వివరణతో ట్రంప్ మాటలకు అర్థాలే వేరులే అని అర్థం అయింది. 

చర్చలు కొనసాగుతున్నాయి

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇంకా చర్చ లు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ‘చర్చలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఇంకా తుది దశకు చేరుకోలేదు. ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చేదై ఉండాలి. భారత్ అదే యోచిస్తోంది. ఇప్పడు ప్రకటించే నిర్ణయాలు ముందస్తు నిర్ణయాలే.’ అని జైశంకర్ తెలిపారు.

అంతకు ముందు ట్రంప్ ఖతార్‌లో మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఏం విక్రయించాలన్నా కష్టం గా ఉంది. అమెరికా వస్తువులపై సుంకాలను సున్నాకి తగ్గిస్తూ భారత్ ఆఫర్ ఇచ్చింది.’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2024లో ఈ రెండు దేవాల మధ్య 129 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేర వాణిజ్యం జరిగింది.